‘సౌత్ నుంచి ఒక ‘బాహుబలి’ వస్తుందని బాలీవుడ్ ఎప్పుడూ ఊహించి ఉండదు. ఆ వరుసలోనే ఎన్నో అద్భుతాలు సౌత్ నుంచి రావడంతో బాలీవుడ్ కాస్తంత నెమ్మదించిన మాట వాస్తవం’ అన్నారు టాలీవుడ్ అగ్రహీరో విజయ్ దేవరకొండ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా ఘనత గురించీ, బాలీవుడ్ సినిమా ప్రస్తుత పరిస్థితి గురించి ఆసక్తికరంగా ఆయన మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘సినిమా ఇండస్ట్రీ సర్కిల్ లాంటిది. ఇక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఓ వెలుగు వెలిగింది. సౌత్ సినిమానైతే పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు సౌత్ సినిమా రాజ్యమేలుతోంది. బాలీవుడ్ కళతప్పింది. అయితే.. ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుందని అనుకోను. రానున్న ఐదారేళ్లలో మళ్లీ పరిస్థితులు మారొచ్చు. కొత్త డైరెక్టర్లొచ్చి బాలీవుడ్ స్థాయిని పెంచొచ్చు. అయితే.. అది సౌత్ డైరెక్టర్ల వల్లే జరుగుతుందని నేననుకుంటున్నా ’ అని అభిప్రాయపడ్డారు విజయ్ దేవరకొండ.