చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)లో అసలు మనిషి బయటికి వచ్చాడు. కొన్నేళ్లుగా పూర్తిగా కామ్‌గా మారిపోయిన ఈ హీరో..తాజాగా మరోసారి ఆటిట్యూడ్ చూపించాడు. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ఎలా ఉంటాడో ప్రేక్షకులకు పరిచయం చేశాడు. గీత గోవిందం, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి క్లాస్ సినిమాలు చేశాడు కదా మనిషి మారిపోయాడు అనుకుంటున్నారేమో.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది.. వాడు బయటకి వస్తే రచ్చ రచ్చే అంటూ మరోసారి తనలోని ఆ పాత విజయ్ ను నిద్రలేపాడు దేవరకొండ కుర్రాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తన పెళ్లి (Marriage)పై రాసిన తప్పుడు వార్తలు కారణం.
కొన్ని రోజులుగా మీడియాలో రష్మిక మందనతో విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్ మీడియా దీన్ని బాగా హైలైట్ చేసింది. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. అధికారికంగా కూడా ప్రకటన రాబోతుంది అంటూ కొన్ని నేషనల్ వెబ్ సైట్స్ విజయ్ దేవరకొండపై వార్తలు రాసాయి. వీటన్నింటిపై ఒకేసారి సమాధానమిచ్చాడు ఈ రౌడీ హీరో. అది కూడా తనదైన శైలిలో ఇచ్చాడు.
As usual nonsense..
Don’t we just
❤️ da news!— Vijay Deverakonda (@TheDeverakonda) February 21, 2022
అందరికీ అర్థమయ్యేలా బూతు పదం వాడకుండా బూతు ట్వీట్ చేశాడు. మరోసారి చెత్త రాతలు నాన్సెన్స్.. ❤️డా న్యూస్ అంటూ సంచలన ట్వీట్ చేశాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మో విజయ్ దేవరకొండ ఇంకా మారలేదు.. మనోడు ఇంకా అలాగే ఉన్నాడు గెలికితే కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. రష్మిక మందనతో ఈయనకు ఎఫైర్ ఉందంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్ కావడానికి కారణం కూడా విజయ్ అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ కలిపి ఇప్పుడు ఒకేసారి సమాధానం ఇచ్చాడు ఈ సెన్సేషనల్ హీరో.