Kushi Trailer | టాలీవుడ్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ (Kushi Trailer)రానే వచ్చింది.
దీనమ్మా కశ్మీర్.. సేమ్ రోజా సినిమాలాగుంది.. అంటూ కశ్మీర్‌కు వచ్చిన విజయ్ దేవరకొండ అంటున్న సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. అక్కడ లోకల్ అమ్మాయి బేగం (సామ్)ప్రేమలో పడటం.. ఆ తర్వాత తాను బేగం కాదు బ్రాహ్మిణ్ అంటూ సామ్ చెప్పడం, ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ నడిచిందనేది కొంచెం సస్పెన్స్‌లో పెడుతూ ఫన్, రొమాంటిక్ టచ్‌తో సాగుతున్న ట్రైలర్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే (Na Rojaa Nuvve) నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఆరాధ్య సాంగ్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఇప్పటివరకు వచ్చిన పాటలు చెబుతున్నాయి. ఖుషి చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఖుషి ట్రైలర్..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
The man is here! @TheDeverakonda entry at the grand #KushiTrailer launch event 🤩
Watch live now!
– https://t.co/TSETRtfgcw#Kushi in cinemas on SEP 1st ❤️🔥@Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/A0MePgv7gG— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2023
On SEPT 1st
We bring to the world
Full #Kushi ❤️https://t.co/gTnd1GJFMj#KushiTrailer pic.twitter.com/k6AzAT3i8e— Vijay Deverakonda (@TheDeverakonda) August 9, 2023
ఖుషి టైటిల్ సాంగ్..
నా రోజా నువ్వే..
ఆరాధ్య సాంగ్..
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023