Chris Martin – Vijay Devarakonda | ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) ఇండియా టూర్ సక్సెస్ఫుల్గా పూర్తి అయిన విషయం తెలిసిందే. ఇండియాలోని అగ్ర నగరాలైన ముంబైతో పాటు అహ్మదాబాద్ (Ahmedabad)లో ఈ కన్సర్ట్ జరుగగా.. సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు ఈ వేడుకకు సింగర్ శ్రేయ ఘోషల్తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.
ఇదిలావుంటే అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన కన్సర్ట్లో తాను తెలంగాణ వాడి(Iam From Telangana Chris Martin)నేనని క్రిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన ఈవెంట్లలో తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతంకి చెందిన వాడినని క్రిస్ చెబుతుంటాడు. ఇండియా కన్సర్ట్లో కూడా తాను తెలంగాణ వాడినని.. తమ బ్యాండ్కు చెందిన సభ్యులంతా భారత్కు చెందినవారేనని చెప్పుకోచ్చాడు. అయితే క్రిస్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మా తెలంగాణ ముద్దు బిడ్డవి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా ఈ విషయంపై నటుడు విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. ఇన్స్టా వేదికగా రాసుకోస్తూ.. వెల్కమ్ క్రిస్ మార్టిన్. జై బోలో తెలంగాణ సినిమాలోని పొడుస్తున్న పొద్దు మీద సాంగ్తో పాటు, కోల్డ్ ప్లే మీద ఎవరైనా మ్యాషప్(Mashup) చేస్తే బాగుంటుంది అని విజయ్ రాసుకోచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్గా మారింది.
Telangana muddu bidda Chris Martin 😍
I wasn’t this happy even at a live Coldplay concert… Dil khush ❤️ pic.twitter.com/nLPSFM7YCv
— Naveena (@TheNaveena) January 26, 2025