Malli Raava | టాలీవుడ్ నుంచి వచ్చిన క్లాసిక్ చిత్రం మళ్ళీ రావా సినిమాను విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు ఈ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆయన దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం కింగ్డమ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో గౌతమ్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా మళ్ళీ రావా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో మొదట కథానాయకుడిగా గౌతమ్ విజయ్‌ని అనుకున్నాడట. అయితే ఈ సినిమా కథ విజయ్‌కి చెప్పినప్పుడు రెండు సమోసాలు తిని నాకేమి ఎక్కట్లేదు బాస్.. నేను వెళుతున్నాను అంటూ విజయ్ వెళ్లిపోయాడు. దాంతో ఆ సినిమాను సుమంత్‌తో తీశాను. ఈ చిత్రం తర్వాత మంచి హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత విజయ్‌తో చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఒకరోజు విజయ్ నాకు కాల్ చేసి మనం సినిమా చేద్దాం ఏ కథ ఉన్నా ఒకే అని చెప్పాడు అలా కింగ్డమ్ తెరకెక్కిందంటూ గౌతమ్ చెప్పుకోచ్చాడు.
మళ్లీరావా విషయానికి వస్తే.. అక్కినేని సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై మంచి హిట్‌ను అందుకుంది. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిచిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. వరుస పరజయాలతో సతమతమవుతున్న సుమంత్ మళ్ళి రావాతో సూపర్ హిట్ అందుకున్నాడు.