Vikram K Kumar | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో విజయ్ తన కెరీర్‌ను మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం అతను తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్తో కలిసి ఒక సినిమా చేస్తుండగా..ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రవి కిరణ్ కోల దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన చిత్రంలో నటించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు ఇప్పటికే టాలీవుడ్ సర్కిల్స్‌లో బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
అయితే ఇవి కాకుండా మరో సూపర్ క్రేజీ కాంబినేషన్ గురించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది ‘మనం’, ‘గ్యాంగ్ లీడర్’, ’24’ వంటి సూపర్ హిట్ మూవీస్‌తో తన మార్క్ చూపిన స్టార్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాంబో గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. విక్రమ్ కే కుమార్ స్టోరీటెల్లింగ్ స్టైల్ ఎమోషనల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ విజయ్ దేవరకొండ ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో కలిస్తే ఏం మ్యాజిక్ జరుగుతుందో అని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్లో మరో మైలురాయి కావచ్చని అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.