విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’ చిత్రం ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. విజయ్, కీర్తి సురేశ్ జోడీగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. నిజానికి వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు కానీ.. కాంబినేషన్ సీన్స్ లేవు. ఏదేమైనా.. విజయ్, కీర్తి కాంబినేషన్ అనగానే ఆడియన్స్‌లో ఓ ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అయ్యింది.
ఇదిలావుంటే.. ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ పాత్ర విషయంలో ఓ వార్త వినిపిస్తున్నది. ఇందులో విజయ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తున్నది. ఈ సీన్స్‌లో ఫాదర్ సెంటిమెంట్ హైలైట్‌గా ఉంటుందట. పైగా ఈ కథలో తండ్రి పాత్ర కీలకమట. మరి ఆ పాత్ర ఎవరు పోషిస్తారో తెలియాల్సివుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ అభిమానులకు కావాల్సిన మసాలాలన్నీ ఉంటాయని వినికిడి.