టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay deverakonda) ప్రస్తుతం ఖుషి (Kushi) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. చెన్నై సుందరి సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్.
ఖుషి నువ్ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే.. అంటూ హేశమ్ అబ్ధుల్ వహబ్ కంపోజిషన్‌లో సాగుతున్న ట్యూన్ ఆల్బమ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది. ఖుషి ఆడియో రైట్స్‌ను సరిగమసౌత్ దక్కించుకుంది. హేశమ్ అబ్ధుల్ వహబ్ అద్భుతమైన పాటలు సిద్దం చేశాడని తాజా ట్యూన్‌తో తెలిసిపోతుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్, సామ్ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ జర్నీ నేపథ్యంలో సూపర్ కూల్‌గా సాగబోతున్నట్టు ఇప్పటివరకు విడుదలైన లుక్స్ చెబుతున్నాయి.
ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో V12 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడు. కాప్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
ఖుషి నువ్ కనబడితే ట్యూన్..
Get ready for a Musical Blast 🎧❤️🔥
Audio rights of #Kushi bagged by @saregamasouth 🎼
Music by the young sensation @HeshamAWMusic ❤️#Kushi @TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @prawinpudi @saregamaglobal pic.twitter.com/rr9gH6k3Un
— Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2023
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023