విజయ్ దేవరకొండ కొత్త సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ వెలుగు చూసింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన గత శుక్రవారం వచ్చింది కూడా. ఇదో పీరియాడికల్ డ్రామా అని చెప్పారుగానీ, మిగతా విశేషాలేం చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఆయన కెరీర్లో తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇదే కావడం విశేషం. 100 నుంచి 120కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మించనున్నట్టు సమాచారం. ఇది విజయ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు. గౌతమ్ తిన్ననూరి సినిమా పూర్తవగానే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.