Vijay Devarakonda | టాలీవుడ్ లవ్లీ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకొని, తరచూ వార్తలలో నిలుస్తున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. గత నాలుగు రోజులుగా వీరి నిశ్చితార్థంకి సంబంధించిన వార్తలు జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా, వీరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని చెబుతున్నారు. ఈ వార్తల వేళ విజయ్ దేవరకొండ తాజాగా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ట్రస్ట్ సభ్యులు విజయ్ను గౌరవంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా తీసిన ఫోటోల్లో విజయ్ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా కనిపించడంతో అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది. ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉండొచ్చునని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో విజయ్ చేతికి రింగ్ కనిపించకపోవడం, ఇప్పుడు మాత్రం తన చేతికి కొత్త రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం వార్తలకు బలం చేకూరింది. అయితే దీనిపై విజయ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక మరోవైపు రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందించకపోయినా, సోషల్ మీడియాలో తన సినిమాల గురించి వరుసగా పోస్టులు చేస్తోంది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను షేర్ చేశారు. దీంతోపాటు బాలీవుడ్ మూవీ ‘థామా’లోని పాట ‘నువ్వు నా సొంతమా’కు సంబంధించిన బీహైండ్ ద సీన్స్ విషయాలు కూడా తెలిపారు.
ఆమె వెల్లడించిన విషయాల ప్రకారం, ఆ పాట 12 రోజుల షూటింగ్లో చివరి రోజు తీసుకున్న అనుకోని నిర్ణయం అని తెలిపారు. “చివరి రోజు అందరికీ ఆ ఆలోచన వచ్చి, 3–4 రోజుల్లోనే పాటను ప్లాన్ చేసి, షూట్ చేశాం. ఆ పాట మేము ఊహించిన దానికన్నా బాగా వచ్చింది,” అని ఆమె చెప్పింది. పాటలో ఆమె డ్యాన్స్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మొత్తానికి విజయ్ చేతికి రింగ్ కనిపించడం ఎంగేజ్మెంట్కు సంబంధించి అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. వారిద్దరూ ఈ విషయంపై త్వరలోనే స్పందిస్తారా? లేదా వదంతులేనా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పరంగా బిజీ గా ఉన్నారు.