Vijay Devarakonda | అగ్ర నాయకానాయికలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట పర్సనల్ లైఫ్‌లో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కటి స్నేహసంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ ఎఫైర్‌పై అనేక కథనాలొచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ప్రేమబంధం లేదని ఈ తారలిద్దరూ అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు.
అయినా సోషల్‌మీడియాలో వార్తలు ఆగడం లేదు. ఫిబ్రవరి నెలలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకోబోతున్నారంటూ పలు జాతీయ వెబ్సైట్లలో వార్తలొచ్చాయి. సోషల్‌మీడియాలో కూడా ఈ న్యూస్ బాగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా వీటిపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరింది. దీంతో ఇప్పటికైతే ఈ నిశ్చితార్థ వార్తలకు ఫుల్స్టాప్ పడ్డట్లయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ..పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.