Vijay Deverakonda | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ హీరోల జాబితాలో టాప్‌లో ఉంటాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అర్జున్ రెడ్డితో బాక్సాఫీస్‌ను షేక్ చేసి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత శివనిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇక పరశురాం డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఢీలా పడిపోయింది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA)ఉమెన్స్ ఫోరం ఈవెంట్‌కు హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా అక్కడి తెలుగు మహిళలు విజయ్ దేవరకొండకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో కలిసి సరదాగా ముచ్చటించాడు రౌడీ బాయ్. అట్లాంటాలో జరిగిన ఈవెంట్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా విజయ్‌తో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. యూఎస్ఏలో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పే తాజా విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అట్లాంటా ఈవెంట్లో ఇలా..
Heartthrob #VijayDeverakonda receives the warmth of the Women’s Forum at American Telugu Association ATA. @TheDeverakonda pic.twitter.com/J8sIZKLUHi
— Madhu VR (@vrmadhu9) June 10, 2024
Devaraaaaaaaa Speech at American Telugu Association – USA 🖤🖤#VijayDeverakonda #USA pic.twitter.com/NdLiuyoNgI
— THE Pavan Kumar Suman (@cult1_rowdy) June 10, 2024