Vijay Devarakonda Visited Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ దర్శించుకున్నాడు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విజయ్‌తో పాటు నటి భాగ్యశ్రీ భోర్సే కింగ్డమ్ టీమ్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
దర్శనం అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడుతూ, “కింగ్డమ్ సినిమా విడుదలకు ముందు స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన చల్లని దీవెనలు అందరికీ ఉండాలి. ఆయన ఆశీస్సులతో మా సినిమా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ స్వామి వారి సన్నిధిలో మా సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేసుకోవడం సంతోషం” అని అన్నారు.
విజయ్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. శనివారం తిరుపతిలో ట్రైలర్ లాంఛ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విజయ్ రాయలసీమ యాసలో మాట్లాడి అదరగొట్టాడు.
Om Namo Venkatesaya ♥️#VijayDeverakonda at Tirumala #Kingdom pic.twitter.com/rXRsFGlfCw
— Milagro Movies (@MilagroMovies) July 27, 2025