Vijay Devarakonda | విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. అధిక బడ్జెట్ కారణంగా ఈ సినిమా హఠాత్తుగా ఆగిపోయిందన్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ ఖండించింది. 8 నెలల క్రితం ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్టుకు పూజా కార్యక్రమాలు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న వదంతులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు నమ్మొద్దని పేర్కొంది.
విజయ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ‘వీడీ12’ షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల విజయ్‌తో జత కడుతున్నది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక భారీ షెడ్యూల్‌ను ఇటీవలే న్యూయార్క్‌లో పూర్తి చేశారు మేకర్స్. పరశురాం దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయిక.