Vijay Devarakonda | ఒకసారి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత అది ఒక పురుగు మాదిరే ఎప్పుడు కుడుతూ ఉంటుంది. ఒక పట్టాన వదిలిపెట్టి ఉండలేరు. అందుకే మన హీరోలు కూడా ఫ్యామిలీ సినిమాలు చేసినా అందులో యాక్షన్ కచ్చితంగా ఉండాల్సిందే అంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇదే చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఈయన పూర్తిగా మాస్ ఇమేజ్ పైనే ఫోకస్ చేశాడు. ఎంచుకునే కథలు కూడా అలాగే ఉన్నాయి. వరుసగా అవి ఫ్లాప్ అవుతున్నా కూడా వాటి వైపు నుంచి దూరంగా జరగడం లేదు విజయ్. మొన్నటికి మొన్న ఖుషి సినిమాతో పర్లేదు అనిపించాడు రౌడీ హీరో. దానికి ముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్.
దాంతో ఫ్యామిలీ సినిమాలు ఈయనకు సరిగ్గా సరిపోతాయి అంటూ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టైటిల్ చూస్తేనే అర్థమయిపోతుంది. కానీ తాజాగా విడుదలైన టీజర్ చూసిన తర్వాత ఇందులో యాక్షన్ కు కూడా ఉండదనే విషయం క్లారిటీ వచ్చింది. ఒకవైపు పూర్తిగా క్లాస్ టచ్ ఇస్తూనే మరోవైపు మాస్ యాక్షన్ హీరో లుక్ లో కూడా విజయ్ కనిపించాడు. తన హీరోలను క్లాస్, మాస్ కలిపి చూపించడంలో పరుశురాం అందవేసిన చేయి. మహేశ్ బాబును కూడా అలాగే చూపించాడు సర్కారు వారి పాట సినిమాలో. దానికి తోడు బలమైన ఎమోషన్స్ రాసుకుంటాడు ఈయన. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా ఇదే చేయబోతున్నాడని టీజర్ చూస్తుంటే అర్థం అయిపోతుంది. సంక్రాంతి సినిమా విడుదల కానుంది. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ మధ్యే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది చిత్ర యూనిట్. బ్యాంకాక్, అమెరికా షెడ్యూల్స్ మాత్రమే బాకీ ఉన్నాయి.
ఇవి పూర్తి చేస్తే ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి అయిపోయినట్టే. దీని తర్వాత మరోసారి యాక్షన్ ఇమేజ్ వైపు అడుగులు వేయమన్నాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు పూర్తిగా మాస్ స్టైలిష్ ఎంటర్టైనర్. అది రెండు భాగాలుగా వస్తుంది. 100 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అది లేట్ అవుతుందని పరుశురాం సినిమాను త్వరగా పూర్తి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి చూడాలిక ఈ సినిమాతో గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అని..!