Vijay Devarakonda-samantha | లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్‌తో విజయ్ దేవరకొండ ఖుషీ రిలీజవుతుంది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. పాటల, ట్రైలర్లు గట్రా సినిమాపై మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. మైత్రీ సైతం ప్రమోషన్లు వీర లెవల్లో ప్లాన్ చేస్తుంది. ఇక మంగళవారం ఈ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా విజయ్, సమంత లైవ్ పర్ఫార్మెన్స్ ఓ హై ఇచ్చింది. ఇప్పుడే సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ చూసిన ఖుషీ మ్యూజికల్ రచ్చనే కనిపిస్తుంది.
లైవ్ పర్ఫార్మెన్స్ ముందే ఉంటుందని తెలిసినా.. ఆ రేంజ్లో ఉంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లలా విజయ్, సమంతలు గాల్లో ఎగరటాలు, విజయ్ సమంతను ఎత్తుకుని గిరగిర తిప్పటాలు, మొత్తంగా వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూడటానికి రెండు కాళ్లు చాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకు సినిమాపై ఉన్న క్రేజ్ ఈ మ్యూజికల్ కాన్సర్ట్‌తో రెండింతలైంది. ఎప్పటిలాగే విజయ్ తన స్పీచ్‌తో రౌడీ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. సమంత సైతం హల్లో హైదరాబాద్ అంటూ స్పీచ్‌తో రచ్చ చేసింది. మొత్తానికి నిన్నటి వేడుక ఒక కన్నుల పండగలా జరిగింది.
రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్, సామ్‌లు భార్య, భర్తలుగా నటించారు. ఇలాంటి సబ్జెక్ట్‌ను హ్యాండిల్ చేయడంలో శివ నిర్వాణ దిట్ట. ఈ సారి కపుల్ జర్నీను ఏ రేంజ్లో చూపిస్తాడో అని అందరిలో అమితాసక్తి ఉంది. పైగా ఈ సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా పోటీ కనిపించడంలేదు. ప్రస్తుతం వీర విహంగం చేస్తున్న జైలర్ ఎంత లేదన్న మరో వారంలో జోష్ తగ్గిపోతుంది. ఇక ఈ రెండు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవి రావడం లేదు. దాంతో సెప్టెంబర్ 1 ఖుషీకి కలిసొచ్చేలానే కనిపిస్తుంది. ఏ మాత్రం మౌత్ టాక్ పాజిటీవ్ టాక్ వచ్చినా.. గీతాగోవిందం యుఫోరియా పక్కా రిపీట్ అవుతుంది.
VJD & SAM live dance performance at #Kushi pre release event 🤩🫶pic.twitter.com/7TcndZZ5FC
— AmuthaBharathi (@CinemaWithAB) August 15, 2023