Rashmika Mandana | ఇలాంటి ఘటన ఇంకొకరికి జరగకూడదు.. రష్మిక మార్ఫింగ్ వీడియోపై విజయ్ దేవరకొండ స్పందన
Vijay Devarakonda | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అందుకు కారణంగా ఆమెకు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ కావడమే. కొందరు జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Vijay Devarakonda | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అందుకు కారణంగా ఆమెకు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ కావడమే. కొందరు జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
విజయ్ దేవరకొండ, తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఇలాంటి నిర్ణయమే ఇప్పుడు తీసుకోవాలి.. మరోసారి ఇంకొకరికి ఇలాంటి ఘటన జరగకూడదు.. డీప్‌ఫేక్ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.. వెంటనే శిక్షించాలి.. అప్పుడు మహిళలు రక్షించబడతారు అని విజయ్ రాసుకోచ్చాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
కొందరు ఆకతాయిలు (Rashmika Mandanna) ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించారు. వీడియోపై సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Vijay Devarakonda
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

