Shravya Varma – Kidambi Srikanth | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వర్మ మేనకోడలు సినీ నిర్మాత, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఇక ఇదే వేడుకకు విజయ్ దేవరకొండ అతడి ఫ్యామిలీతో రాగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లికి వచ్చి సందడి చేసింది. ఇంకా వీరే కాకుండా.. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్, వంశీ పైడిపల్లి, యాంకర్ సుమ తదితరులు హాజరయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
కాగా సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ గా శ్రావ్య వర్మకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు అక్కినేని నాగార్జున, పంజా వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహారించింది శ్రావ్య వర్మ.