Vijay Devarakonda – Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట పర్సనల్ లైఫ్‌లో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కటి స్నేహసంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి లవ్ ఎఫైర్‌పై అనేక కథనాలొచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ప్రేమబంధం లేదని ఈ తారలిద్దరూ అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు.
అయితే రీసెంట్గా సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించిన విజయ్.. ఈ ఆల్బమ్ ప్రమోషన్స్‌లో భాగంగా.. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్ కాదని నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు అంటూ అసలు విషయం బయట పెట్టాడు. అయితే విజయ్ ప్రస్తుతం రష్మికతో డేటింగ్లో ఉంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నకలిసి ఒక రెస్టారెంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించారు. అయితే రష్మిక తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా… వీరిద్దరి కలిసి తింటున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ ఫొటోలు చూస్తుంటే.. ఈ జంట ప్రస్తుతం వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది.
సినిమాల విషయానికి వస్తే.. విజయ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తుండగా.. రష్మిక మందన్న అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప సినిమాలో నటిస్తుంది.
Vijay Devarakonda & Rashmika Mandanna pic.twitter.com/R499vonGjQ
— Telugu Chitraalu (@TeluguChitraalu) November 23, 2024