Liger Movie Trailer | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఈక్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఒక లయన్‌కి టైగర్‌కు పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ మొత్తం విజయ్ ఊరమాస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌కు నత్తి ఉన్నట్లు తెలుస్తుంది. ట్రైలర్లో ‘ఐ లవ్ యూ’, ‘ఐ అమ్ ఎ ఫైటర్’ అంటూ నత్తితో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫి బాగుంది. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ రెట్టింపు చేసింది.
ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.