Vijay Deverakonda | క్రేజీ టాక్.. గీతగోవిందం కాంబినేషన్ రిపీట్ ..!
గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందించాడు పరశురాం (Parasuram). ఈ సినిమా పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గర చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు పరశురాం (Parasuram). గీతగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందించాడు. సింపుల్ కథతో మ్యాజిక్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా నిర్మాతలకు కాసులు కురిపించడమే కాదు.. పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గర చేసింది. రష్మిక మందన్నాకు కూడా ఛలో సినిమా తర్వాత టాలీవుడ్లో మంచి బ్రేక్ అందించింది.
గీతగోవిందం (Geeta Govindam) క్రేజీ కాంబినేషన్ మళ్లీ రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురాం మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పరశురాం మరోవైపు బాలకృష్ణతో కూడా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడన్న వార్తలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా.. ఈ సినిమాకు టైం పట్టనుందట.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో సినిమాకు ప్లాన్ చేయాలని పరశురాం అనుకుంటున్నట్టు జోరుగా టాక్ నడుస్తోంది. గీతగోవిందం క్రేజీ కాంబినేషన్‌కు ముహూర్తం కుదురుతుందా..? లేదా..? అనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఖుషీ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తెలుగులో కొత్త సినిమాకు సంతకం చేయలేదు. లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ చేయనున్న జేజీఎం (జనగణమన) సస్పెన్స్‌లో పడ్డది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

