Vijay Devarakonda | లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ పడిన ఖుషితో మంచి ఓపెనింగ్స్‌నే సాధించాడు విజయ్ దేవరకొండ. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు కానీ.. ఫైనల్‌గా విజయ్‌కు కాస్త హోప్నిచ్చింది. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కుతుంది. కాగా తాజాగా దిల్‌రాజుతో విజయ్ మరో సినిమా చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. రీసెంట్గా దిల్‌రాజు బ్యానర్లో రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కోల ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. కాగా అందులో హీరో ఎవరా అన్నది క్లారిటీ లేదు. కాగా ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లో హీరో విజయ్ దేవరకొండనే అని గట్టిగా వినిపిస్తుంది.
గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. అయితే రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ కథలా కాకుండా కాస్త భిన్నంగా హీరో క్యారెక్టరైజేషన్ ఉండనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్ కాబోతుందట. ఇక వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటుగా పరుశురామ్ పెట్లతో మరో రోమ్-కామ్ చేస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది.