Liger Attitude Glimps | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ కోసం అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఒక్క ట్రైలర్‌తోనే లైగర్ చిత్రంపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో లైగర్ యాటిట్యూడ్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. సునీల్ కశ్యప్ స్వర పరిచిన ఈ పాటను విజయ్ స్వయంగా ఆలపించాడు. పూరి సాహిత్యం అందించాడు.ఇలా చిత్రబృందం డిఫరెంట్‌గా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.