Kingdom | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం కింగ్డమ్ (Kingdom). సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ను పంచుకున్నాడు విజయ్ దేవరకొండ.
ఈ సినిమా లవ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంకకి బయలుదేరినట్లు విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పాస్‌పోర్ట్ పట్టుకుని ఎయిర్‌పోర్ట్‌లో విమానం కోసం ఎదురుచూస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. అణచివేయబడుతున్న ప్రజలకోసం విజయ్ నాయకుడిగా ఎలా నిలబడ్డాడు అనే కథతో ఈ సినిమా రాబోతుంది.
Off again to the #Kingdom of Lanka
Shooting love songs ❤️Wearing the madcool #RWDY Summer flannels 🙂
Will be available to you all soon for shopping! @RWDYclub pic.twitter.com/GlwVUT1HTk
— Vijay Deverakonda (@TheDeverakonda) March 23, 2025