విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు అబ్బురపరిచే విజువల్స్‌తో ఆకట్టుకున్నాయి.
‘మేము ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా ఉండాలని శ్రమించాం. ఈ నెల 31న బాక్సాఫీస్ తుఫానుకు నాంది పలుకుతుంది’ అని నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో పేర్కొంది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.