Kingdom Movie | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగ వ్యవహారించగా.. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించింది. అయితే జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో గీతా గొవిందం(రూ.130 కోట్లు) తర్వాత రెండోసారి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన హీరోగా విజయ్ రికార్డును అందుకున్నాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. సూరి అన్న శివ (సత్యదేవ్). అనుకోని కారణాల వల్ల శివ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. తన అన్న కోసం సూరి వెదుకుతూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరి తన పై అధికారిపై చేయి చేసుకుంటాడు. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు సూరికి ఓ మిషన్ అప్పగిస్తారు అధికారులు. అండర్ కవర్ ఏజెంట్‌గా మారి శ్రీలంకలో వున్న ఓ గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకోవాలి. ఇదీ ఆ మిషన్. ఇలా చేస్తే సూరికి తన అన్నని కలిసే అవకాశం దొరుకుతుంది. ఈ మిషన్కి ఒప్పుకున్న సూరి శ్రీలంక పయనం అవుతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు శివ లంకకి ఎందుకు వెళ్లాడు? అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడు? అన్న కోసం వెళ్లిన సూరికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇదంతా మిగతా కథ.