Vijay Devarakonda Kingdom Bookings Open | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక శుభవార్త! ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్లను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లైన బుక్‌మైషోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌లో ఈ సినిమా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో సాధారణ టికెట్ రేట్లతోనే అందుబాటులోకి రావడం విశేషం.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ, ‘కింగ్డమ్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా విజయం విజయ్ కెరీర్‌కు కీలకం కానుంది. మరి ‘కింగ్డమ్’ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే జూలై 31 వరకు వేచి చూడాలి.
It’s the #KINGDOM call…😎
BOOKINGS OPEN NOW & It’s Already TRENDING on @bookmyshow 🔥
In Cinemas July 31st, 2025 ❤️#KingdomOnJuly31st @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @dopjomon #GirishGangadharan… pic.twitter.com/ECgl58ggpS
— Sithara Entertainments (@SitharaEnts) July 27, 2025