Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి చూపులు(Pelli Chooplulu) సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో స్టార్ హోదా సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్గా విజయ్ నటించిన ఖుషీ (Kushi) సినిమా సెప్టెంబర్ 01న విడుదలై మంచి విజయం సాధించింది. లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత ఈ సినిమా రావడంతో ఖుషీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు రూ.30 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ఈ సినిమా తాజాగా ఓటీటీ కూడా లాక్ చేసుకుంది. ఇక షూటింగ్ బ్రేక్ ఇచ్చి.. వెకేషన్ ఏంజాయ్ చేస్తున్న విజయ్ తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేశాడు.
తాజాగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్లో ఐస్ బాత్ టబ్ ఫొటోను పంచుకున్నాడు. సండే మార్నింగ్స్ (Sunday Mornings) అంటూ ఐస్ బాత్ టబ్ ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)తో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Sunday mornings 🥰 pic.twitter.com/v3o1LV8psM
— Vijay Deverakonda (@TheDeverakonda) September 24, 2023