Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రతి సినిమా కోసం చాలా కసిగా పని చేస్తున్నాడు. కాని సక్సెస్ అనేది రావడం లేదు. ఇక జులై 31న కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. మూవీ తప్పక హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉంది చిత్ర బృందం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కూడా హాజరైంది. అయితే కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముందు పెద్ద దుమారమే చెలరేగింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతిలో నిరసనలు చేపట్టాయి.
విజయ్ దేవరకొండ గతంలో చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఆయనని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశాయి. అతను పాల్గొనబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ముందుగానే హెచ్చరించడంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శాంతియుతంగా ముగిసేలా చూశారు. ఇప్పటికైతే ఎలానో అలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పూర్తి చేశారు కాని రానున్న రోజులలో విజయ్ దేవరకొండకుఈ ప్రచార కార్యక్రమాల్లో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమస్యలపై స్పష్టత ఇవ్వకపోతే, గిరిజన సంఘాల ఆగ్రహం ఇంకా పెరిగే ప్రమాదముంది.
విజయ్ దేవరకొండ గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు గతంలో మాట్లాడిన కూడా ఇప్పటికీ వివాదాస్పదంగానే కొనసాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసాయని, ఆ సంఘాలు అభిప్రాయపడ్డాయి. అతను పాల్గొనబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ముందుగానే హెచ్చరిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల మధ్య కింగ్డమ్ మూవీ ఎలా ముందుకు సాగుతుందా అనేది చూడాలి.