Vijay Devarakonda | సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కచ్చితంగా మేము వస్తాం అంటే మేము వస్తాం అంటూ పోటీ పడుతున్నాయి. పైగా అందరూ పెద్ద హీరోలే కావడంతో అంచనాలు కూడా బానే ఉన్నాయి. ఒకవైపు మహేశ్ బాబు గుంటూరు కారం.. మరోవైపు రవితేజ ఈగల్.. ఇంకోవైపు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో పాటు తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటి షూటింగ్ కూడా ఊహించిన దాని కంటే వేగంగా జరుగుతుంది. అందరూ పండగను దృష్టిలో పెట్టుకొని.. తమ తమ సినిమాల షూటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు గుంటూరు కారం షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. న్యూ ఇయర్ కోసం ఈయన కొత్త ప్లానింగ్స్ సిద్ధం చేస్తున్నాడు. కుటుంబంతో పాటు వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇంకోవైపు నాగార్జున నా సామిరంగా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇప్పటికే నాలుగు పాటలు మినహా మిగిలిన షూటింగ్ అంతా అయిపోయింది. రవితేజ ఈగల్, తేజ హనుమాన్ సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ రెండు సినిమాలు కచ్చితంగా పండక్కి రావడం ఖాయం. అన్ని బాగానే ఉన్నాయి కానీ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం సంక్రాంతికి వస్తుందా రాదా అని అనుమానాలు ఉన్నాయి. అదేంటి షూటింగ్ అయిపోతుంది కదా విడుదల కాకుండా ఉండటం ఏంటని.. అనుకోవచ్చు ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీ స్టార్ పూర్తి చేస్తున్నాడు విజయ్. కాకపోతే డిజిటల్ డీల్ కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.
జనవరి 14న ఫ్యామిలీ స్టార్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. అయితే ఇదే పండక్కి మరో అరడజన్ సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ డిజిటల్లో దాదాపు ఒకేసారి విడుదల కానున్నాయి. విజయ్ దేవరకొండ మార్కెట్‌ను బట్టి చాలా ఎక్కువ రేటుకు ఓటీటీ డీల్ పలుకుతుంది. దాదాపు 30 కోట్లకు పైగానే ఫ్యామిలీ స్టార్ రైట్స్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత రేట్ పెట్టి కొన్నప్పుడు సంక్రాంతికి థియేటర్లో రిలీజ్ చేస్తే.. సరిగ్గా 40 రోజుల తర్వాత మిగిలిన అన్ని పండగ సినిమాలతో కలిపి డిజిటల్లో స్ట్రీమింగ్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే ఓటీటీలో వీవర్ షిప్ భారీగా పడిపోతుంది. అందుకే థియేటర్లో స్త ఆలస్యంగా విడుదల చేస్తే.. డిజిటల్ రిలీజ్ కూడా సోలోగా దొరుకుతుందని నిర్మాతలపై మీద ఓటీటీ సంస్థలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఫ్యామిలీ స్టార్ పండక్కి రావడం దాదాపు అసాధ్యం.