Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా.. ప్రస్తుతం శ్రీలంకలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలావుంటే ఈ సినిమా షూటింగ్ అనంతరం ఖాళీ సమయంలో విజయ్ దేవరకొండ బోట్ రైడ్ చేశాడు. విజయ్ ఒక్కడే బోట్ రైడ్ చేస్తూ నీటిలో దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక అయినట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.
Adventures on water #BoatFun @TheDeverakonda #VijayDeverakonda pic.twitter.com/PVwJwF9RAN
— Suresh PRO (@SureshPRO_) September 23, 2024