గత కొద్ది రోజులుగా లైగర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ రోజు తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో అతను తన కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి విజయ్ దేవరకొండకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. విజయ్ దేవరకొండ వెంట ఆయన తల్లి, తండ్రి, సోదరుడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు.
లైగర్ చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల చేయనున్నారు ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. సినీయర్ నటి రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.
బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్ టైసన్ క్లైమాక్స్ యాక్షన్ సీన్లో రింగ్‌లోకి దిగుతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విజయ్ బాక్సర్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Hero #VijayDeverakonda, along with his family, offers prayers at Tirumala. @TheDeverakonda @ananddeverkonda pic.twitter.com/JMNDt1GJdl
— BA Raju's Team (@baraju_SuperHit) October 10, 2021