Liger Movie Promotions | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఇండియా మొత్తం ఊపేసింది. ఆరున్నర కోట్ల వ్యూస్‌తో గత పదకొండు రోజులుగా యూట్యూబ్ ట్రెండిగ్‌లో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రానికి విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకపోయినా.. లైగర్ పోస్టర్లు, ట్రైలర్లతో హిందీలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లను స్టార్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రమోషన్లను జోరుగా జరుపుతున్నారు.
‘లైగర్’తో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని నావి హోటల్లో భారీ ఎత్తున మేకర్స్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. విజయ్ పోస్టర్లు పట్టుకుని అమ్మాయిలు ‘వి లవ్ యూ’ అంటూ విజయ్‌పై ప్రేమను తెలిపారు. ఇక ఈవెంట్లో విజయ్ మాట్లాడుతుండగానే అభిమానులు ఒక్క సారిగా ప్రేక్షకులు స్టేజ్ పైకి ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు కింద పడ్డారు. వారిని బౌన్సర్లు, ఇతర సెక్యూరిటీ బయటకు తీశారు. నిర్వాహకులు క్రౌడ్‌ను కంట్రోల్ చేయలేక ఈ కార్యక్రమాన్ని అర్థాంతరంగా ఆపేశారు. ఇక విజయ్- అనన్య స్టేజి నుండి దిగి వెళ్ళిపోయారు.
దీనిపై విజయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించి.. ‘మీ ప్రేమ నన్ను తాకింది. ఇంతటి ఆదరాభిమానాన్ని ఊహించలేదని. మీరందరూ ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్ళారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా మీతో కలిసి చాలా కాలం ఉండాలనకుంటున్నాను. నేను పడుకునే ముందు మీ అందరి గురించే ఆలోచిస్తున్నాను’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పాడు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లైగర్ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
#AnanyaPanday #VijayDeverakonda girl fainted in event at Navi Mumbai 😥😥 @viralbhayani77 pic.twitter.com/OQuNJGciMh
— Viral Bhayani (@viralbhayani77) July 31, 2022
“The Vijay Deverakonda” craze!!!#LIGER madness all over india, everyone is super excited for the movie and it's a sureshot blockbuster 🔥💥 #VijayDeverakonda #LigerSaalaCrossbreed #LigerHuntsFromAug25th pic.twitter.com/Y5vcegOPu9
— Aishusaiᴸᶦᵍᵉʳᵒⁿᴬᵘᵍ²⁵🐯 (@theaishusai) July 31, 2022
#VijayDeverakonda#Liger #AnanyaPanday pic.twitter.com/NSHs8B1F4o
— Sky (@vd4lyf) July 31, 2022