బుక్ మై షో వెబ్సైట్లో వచ్చే రివ్యూలను, రేటింగ్స్‌ని కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలిపివేయడంపై అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ చర్య తనకు సంతోషాన్నీ, కొంత బాధను కూడా కలిగిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఈ చర్య వల్ల కొన్ని కలలు నిజమవుతాయి. కొందరి కష్టం ఫలిస్తుంది. నిర్మాతల డబ్బుకు భరోసా ఏర్పడుతుంది. ఇక విచారించాల్సిన విషయం ఏంటంటే.. సొంతవాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టించడం.
‘బతకండి.. బతకనీయండి’ అనే నినాదం ఏమైంది? నా ‘డియర్ కామ్రేడ్’ టైమ్‌లోనే వ్యవస్థీకృతమైన రాజకీయాలతో కూడిన ఈ తరహా దాడులు చూసి షాకయ్యాను. అప్పుడు నేను మాట్లాడితే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినైట్టెంది. కొందరైతే మంచి సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరంటూ నాకే క్లాసులు పీకారు. ఇప్పుటికైనా నిజం తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. మెగాస్టార్ లాంటి అగ్ర హీరో సినిమాకే ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ధన్యవాదాలు’ అని ఆనందం వెలిబుచ్చారు విజయ్ దేవరకొండ.