నా దృష్టిలో అదే బెస్ట్ కాంప్లిమెంట్!
సాధారణంగా సినీరంగంలో విజయాల ప్రాతిపదికనే తారల ఇమేజ్, స్టార్‌డమ్‌ను నిర్వచిస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండ ఈ లెక్కలకు అతీతం. జయాపజయాలతో సంబంధంలేని ఫ్యాన్ ఫాలోయింగ్ అతనిది. మనసులో ఉన్నదిఉన్నట్లు మాట్లాడతాడు కాబట్టి అభిమానులు ఆయన్ని రౌడీహీరో అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు.
సాధారణంగా సినీరంగంలో విజయాల ప్రాతిపదికనే తారల ఇమేజ్, స్టార్‌డమ్‌ను నిర్వచిస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండ ఈ లెక్కలకు అతీతం. జయాపజయాలతో సంబంధంలేని ఫ్యాన్ ఫాలోయింగ్ అతనిది. మనసులో ఉన్నదిఉన్నట్లు మాట్లాడతాడు కాబట్టి అభిమానులు ఆయన్ని రౌడీహీరో అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చి విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా శనివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ విజయ్ దేవరకొండ పంచుకున్న విశేషాలు.
- తెలుగుతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా మలయాళంలో భారీ వసూళ్లున్నాయి. అక్కడ తమిళ వెర్షన్లోనే సినిమా రిలీజ్ చేశాం. అయినా ప్రేక్షకులు ప్రేమ చూపించడం ఆనందంగా ఉంది.
- ప్రతీ సినిమా రిలీజ్ ముందు ఒత్తిడి ఉంటుంది. అది సహజం. సినిమా హిట్ అయితే మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువవుతుంది. ‘కింగ్డమ్’ సినిమాకు సంబంధించి యూఎస్‌లో మొదటిషో పూర్తయి పాజిటివ్ టాక్ రాగానే చాలా సంతోషంగా అనిపించింది.
- అన్నదమ్ముల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పినప్పుడే చాలా ఆసక్తికరంగా అనిపించింది. యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. షాట్ కంపోజిషన్, మ్యూజిక్.. ఇలా ప్రతీ విషయంలో గౌతమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు.
- ఈ సినిమా రెండో భాగం మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నది. ఇందులో దేశభక్తితో పాటు రాజుగా మారిన తెగ నాయకుడి ప్రయాణం ఉంటుంది. ‘కింగ్డమ్’ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. అన్ని విషయాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండో భాగం చేయాలని నిర్ణయించుకున్నాం. గౌతమ్ ఈ కథ చెప్పిన తర్వాత రిఫరెన్స్ కోసం ‘వైకింగ్స్’ ‘ది లాస్ట్ కింగ్డమ్’ వంటి సిరీస్‌లు వరుసగా చూశా.
- ఈ సినిమా రెండో భాగంలో ఓ స్టార్ హీరో ఉంటారు. సోషల్‌మీడియాలో ‘రానా’ అంటూ ప్రచారం జరుగుతున్నది. అందులో వాస్తవం లేదు. ఆ హీరో ఎవరనేది దర్శకుడు గౌతమ్ వెల్లడిస్తారు. నేను నెగెటివ్ ప్రచారం గురించి పెద్దగా ఆలోచించను. సినీరంగంలో ఉన్నవారికి ఆది సాధారణ విషయమే. పదేళ్ల క్రితం నేను ఎవరికీ తెలియదు. ఈ రోజు ఇన్ని లక్షలమంది ప్రేక్షకులు నాపై అభిమానం చూపిస్తున్నారు. అందుకే వారి కోసం మంచి సినిమాలు ఇవ్వాలనే తపనతో పనిచేస్తుంటా. అది తప్ప వేరే ఇతర విషయాల గురించి అస్సలు ఆలోచించను.
- ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన వందలాది మందిని చూసి హ్యాపీగా ఫీలయ్యా. వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. నాకు వచ్చిన అవార్డును వేలం వేస్తే 25లక్షలు వచ్చాయి. వాటిని చారిటీ కోసం ఉపయోగించా. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి నా రెమ్యునరేషన్ ఐదు లక్షలు. అప్పట్లో నాకు అదే చాలా పెద్ద అమౌంట్.
- ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. చాలా రోజుల తర్వాత అభిమానుల కళ్లలో ఆనందాన్ని చూశా. మొదటిషో పూర్తవగానే చాలా మంది ఫోన్లు చేసి ‘మనం హిట్ కొట్టినం’ అని చెప్తుంటే చెప్పలేని ఆనందం కలిగింది. సుకుమార్‌గారు ఫోన్ చేసి సినిమా బాగుందని ప్రశంసించారు. నాకు సుకుమార్‌గారంటే చాలా ఇష్టం. ‘అర్జున్ రెడ్డి’ టైం నుంచే మేమిద్దరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనేంటే ఇష్టం. అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను.
- ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రాయలసీమ నేపథ్య కథాంశమిది. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన కథతో సినిమా చేస్తున్నా. వారిద్దరూ చాలా ప్రతిభావంతమైన దర్శకులు. ప్రతి విషయాన్ని డిటేయిల్డ్‌గా చెప్పాలనుకుంటారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

