అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ విషయంలో వారిద్దరూ గోప్యతను పాటిస్తున్నారు. ఎక్కడా దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. సరైన సమయంలో అన్ని వివరాలను వెల్లడిస్తారని వారి సన్నిహితులు అంటున్నారు. గత నెలలో జరిగిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్‌మీట్‌లో ఈ జంట తళుక్కున మెరిశారు.
అదే వేదికపై విజయ్‌ని పొగడ్తల్లో ముంచెత్తింది రష్మిక. దాంతో ఈ జంట పెళ్లి ఖాయమనే నిర్ణయానికొచ్చారు అభిమానులు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లిపీటలెక్కబోతున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
కొద్దిమంది కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేయబోతున్నారని, అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే విజయ్-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందేనని, అప్పటివరకు వారి పెళ్లి తేదీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుందన్నది అభిమానుల మాట.