విజయ్ ఆంటోని కథానాయకుడిగా అరుణ్‌ప్రభు దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘భద్రకాళి’. సర్వంత్రామ్ క్రియేషన్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. శుక్రవారం ‘జిల్ జిల్’ అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు.
విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ పాటను భోలేషావలి స్వయంగా రాసి ఆలపించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సమాజంలోని దుష్టశక్తుల ఆటకట్టించే శక్తివంతమైన వ్యక్తిగా విజయ్ ఆంటోని పాత్ర సాగుతుందని, పోరాట ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, దర్శకత్వం: అరుణ్‌ప్రభు.