శ్రీవారి సేవలో నవ దంపతులు
కొత్త దంపతులు విఘ్నేష్ శివన్-నయనతార శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త జంటను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. విఘ్నేష్శివన్-నయనతార గతంలో అనేక మార్లు తిరుమలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. తొలుత వివాహాన్ని కూడా స్వామివారి సన్నిధిలోనే చేసుకోవాలని భావించారు. ప్రయాణపరంగా ఉండే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం విఘ్నేష్శివన్-నయనతార తొలిసారి తిరుమలకు విచ్చేయడం ప్రత్యేకంగా నిలిచింది.
వివాదంలో నయనతార: తిరుమల దర్శనం సందర్భంగా నయనతార వివాదంలో చిక్కుకుంది. తిరుమల మాడవీధుల్లో ఆమె చెప్పులు వేసుకొని తిరగడాన్ని చాలా మంది తప్పుపట్టారు. నయనతార చెప్పులు వేసుకొని నడుస్తున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. పవిత్ర క్షేత్రంలో ఆచారాలు తెలుసుకొని నడచుకోవాలని పలువురు నెటిజన్లు హితవు పలికారు. కాగా నయనతార దంపతుల ఫొటోషూట్, తిరుమాడ వీధుల్లో చెప్పులు ధరించి రావడంపై టీటీడీ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

