పద్మభూషణుడైన తర్వాత అజిత్ నుంచి రానున్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘విడాముయార్చి’. ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో రానుంది. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ ‘అద్భుతమైన కథ, కథనాలతో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందింది. అజిత్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునే సినిమా ఇది’ అని నమ్మకం వెలిబుచ్చారు. తెలంగాణ, ఏపీలో ఏషియన్ సురేష్ ఎంటైర్టెన్మెంట్స్, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సన్‌టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకున్నది. అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో త్రిష, రెజీనా కసండ్రా కథానాయికలు. ఈ చిత్రానికి కెమెరా: ఓం ప్రకాష్, సంగీతం: అనిరుథ్ రవిచంద్రన్, నిర్మాత: సుభాస్కరన్.