VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయార్చి (Vidaa Muyarchi). ఏకే 62గా వస్తోన్న ఈ మూవీలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2025 జనవరిలో పొంగళ్ కానుకంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మేకర్స్ నుంచి విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త స్టిల్స్ రూపంలో బయటకు వచ్చింది.
విదాముయార్చి షూటింగ్ చివరి దశలో ఉంది. అజిత్ కుమార్ స్టైలిష్ సూట్లో ఉండగా.. త్రిష చీరకట్టులో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్రేజీ స్టార్లు అందమైన లొకేషన్లో చిరునవ్వులు చిందిస్తూ నడుచుకుంటూ వస్తున్న స్టిల్‌తోపాటు లొకేషన్లో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ షూట్ లొకేషన్ ఎక్కడనేది తెలియాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. విదాముయార్చి పోస్టర్లు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో ఆరవ్ కీ రోల్లో నటిస్తున్నాడు. అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63ను కూడా చేస్తుండగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Coming soon…..#VidaaMuyarchi 🧿 pic.twitter.com/g6ic3PwEQM
— Trish (@trishtrashers) December 17, 2024
In the final leg of the shoot! 🎬 The journey of persistence edges closer. 🔥#VidaaMuyarchi From Pongal 2025 #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial @anirudhofficial @Aravoffl @ReginaCassandra… pic.twitter.com/yCwFoe5Gcc
— Lyca Productions (@LycaProductions) December 17, 2024
Dacoit | అవును వదిలేసాను కానీ అంటున్న మృణాల్ ఠాకూర్.. అడివి శేష్ డెకాయిట్ లుక్ వైరల్
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Suman | హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్