కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ పాత్రల్లో రాణిస్తున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘ఛావా’ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్నది. తాజాగా ఆయన పౌరాణిక కథాంశంలో నటించబోతున్నారు. పరశురాముడి నేపథ్యంలో రూపొందించబోతున్న చిత్రంలో ఆయన పరశురాముడి పాత్రను పోషించబోతున్నారు.
నిర్మాత దినేష్ విజాన్ తెరకెక్కించబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది నవంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్తుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని బాలీవుడ్ సమాచారం. ‘ఈ కథ వినగానే వెంటనే సినిమాకు అంగీకరించాను. పరశురాముడి ధైర్యసాహాసాలను ఆవిష్కరిస్తూ భారీ యాక్షన్ హంగులతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు’ అని విక్కీ కౌశల్ పేర్కొన్నారు.