Shashtipoorthi movie | సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా నటిస్తున్న చిత్రం ‘షష్టి పూర్తి’. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘లేడీస్ టైలర్’ హిట్ పెయిర్ మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.
వేయి వేణువుల అంటూ సాగిన ఈ పాటలో రాజేంద్రప్రసాద్, అర్చనల మధ్య సన్నివేశాలు చూపించారు. వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని తెలుస్తోంది. కార్తీక్, విభావరి ఆప్టే జోషి కలిసి పాడిన ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా.. ఇళయారాజా సంగీతం సమకుర్చాడు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లవ్ ట్రాక్ మరియు మెలోడీ సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన పాట ‘షష్టి పూర్తి’ వేడుకలోని సందడిని తెలియజేస్తోంది. ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ‘షష్టి పూర్తి’ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.