Vidudhala Part 2 | కోలీవుడ్ నుంచి విడుదలైన పీరియాడిక్ క్రైం థ్రిల్లర్ విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) . వెట్రిమారన్ (Vetri Maaran) డైరెక్షన్లో సీక్వెల్ ప్రాజెక్ట్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తుందని తెలిసిందే. విజయ్ సేతుపతి (VijaySethupathi), సూరి, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ 2024 కానుకగా విడుదల చేయబోతున్నారన్న వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీక్వెల్లో అనురాగ్ కశ్యప్,ర గౌతమ్ వాసు దేవ్ మీనన్, రాజీవ్ మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్, గ్రాస్‌రూట్ ఫిల్మ్ కంపెనీ, రెడ్ జియాంట్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ్ సౌండ్ ట్రాక్ అందిస్తున్నాడు.
ఈ సినిమాతో కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. హీరోగా సూపర్ బ్రేక్ అందుకున్నాడు. విడుతలై పార్ట్-1లో విజయ్ సేతుపతి పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటించాడు. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా కనిపించాడు. సీక్వెల్లో కూడా ఈ పాత్ర కొనసాగనుండగా.. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా మంజు వారియర్ (Manju Warrier) నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!