సీనియర్ నటుడు డా.మురళీమోహన్ నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ‘డా.మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్’ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో మురళీమోహన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనాచౌదరి, సినీప్రముఖులు ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, సి.అశ్వనీదత్, కోట శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు. మురళీమోహన్ సుదీర్ఘ నటప్రస్థానాన్ని అతిథులందరూ గుర్తుచేసుకున్నారు. ఆయన మంచితనాన్ని, సేవాగుణాన్నీ, ఆర్థిక క్రమశిక్షణను వారందరూ కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.