ఎంసీఏ చిత్రంతో దర్శకుడిగా మారిన వేణు శ్రీరామ్ .. వకీల్ సాబ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పింక్ చిత్రానికి రీమేక్‌గా వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించగా, చెప్పాలనుకున్న పాయింట్‌ను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా చక్కగా చూపించాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీకు ఇంత మంచి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా “హ్యాపీ బర్త్ డే మాస్ గాడ్ వేణు శ్రీరామ్” అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేశారు పవన్ ఫ్యాన్స్.
మొదటి సారి ఓ దర్శకుడికి ఇలా హ్యాష్ ట్యాగ్‌తో ఫుల్ ట్రెండింగ్ నడిచింది. వేణు శ్రీరామ్‌కు పవన్ అభిమానుల నుండి మంచి గిఫ్ట్ అందడంతో ఆయన ఫుల్ సంతోషించారు. అయితే మంగళవారం వేణు శ్రీరామ్ బర్త్ డే కావడంతో ఆయన తన బర్త్‌డేను కుటుంబ సభ్యులతో కలిసి సింపుల్‌గా జరుపుకున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, వేణు శ్రీరామ్ త్వరలో బన్నీతో కలిసి ఐకాన్ అనే సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.