Suriya 46 | కోలీవుడ్ యాక్టర్ సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న సూర్య 46 (Suriya 46). ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్‌లు కీలక పాత్ర పోషిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ మూవీ ఏప్రిల్‌లో థియేటర్లలోకి వస్తుందంటూ ఇప్పటికే న్యూస్ నెట్టింట రౌండప్ చేస్దుండగా.. ఈ మూవీని జులై 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారంటూ తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. దీనిపై సూర్య టీం నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్. తాజా కథనాల ప్రకారం గజినీలో సంజయ్ రామస్వామి పాత్ర లైన్లో ఈ చిత్రంలో సూర్య రోల్ ఉండబోతుందని తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 45 ఏండ్ల వ్యక్తికి 20 ఏండ్ల యువతికి మధ్య రిలేషిన్ షిప్ నేపథ్యంలో ఉండబోతుందట.. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా..? ఇద్దరి మధ్య ట్రాక్ ఎలా ఉండబోతుందనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు సూర్య 46 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సూర్య మరోవైపు సుధాకొంగర డైరెక్షన్ల సూర్య 47లో నటిస్తున్నాడని తెలిసిందే.