Telangana gaddar awards 2024 | తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం (Telangana gaddar awards 2024) మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఘనంగా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భటివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజుతోపాటు పలువురు జ్యోతి ప్రజ్వలన చేసిన అవార్డుల వేడుకను ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం భట్టి వికమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయా కేటగిరీల్లో గెలుపొందిన విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. విజేతలకు మెమొంటోతోపాటు రూ.5 లక్షలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ కి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును గణేష్ ఆచార్య (బాలీవుడ్) అందుకున్నారు.
అవార్డులు అందుకున్న వారి జాబితా..
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా అధ్నితిన్ జిహాని చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా వెంకీ అట్టూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ స్టోరీ రైటర్‌గా శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఆడియో గ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి)
ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా నల్ల శీరను (రజాకార్)
ఉత్తమ సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ సహాయ నటుడు : ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి : శరణ్య (అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ గాయకుడు : ఊరు పేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)
ఉత్తమ నేపథ్య గాయని : శ్రేయా ఘోషల్ పుష్ప 2 (సూపేటి అగ్గిరవ్వ)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాలు, హారిక (మెర్సీ కిల్లింగ్)