గురువారం 04 మార్చి 2021
Cinema - Dec 29, 2020 , 10:30:34

ఇండియ‌న్ టీంకు శుభాకాంక్ష‌లు తెలిపిన వెంక‌టేష్‌

ఇండియ‌న్ టీంకు శుభాకాంక్ష‌లు తెలిపిన వెంక‌టేష్‌

మొద‌టి టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా  రెండో టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించ‌డంతో టీంకు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా భార‌త టీంకు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. అద్భుత విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు.  టీం మొత్తం క‌లిసిక‌ట్టుగా ఆడ‌డం వ‌ల‌న ఇండియా మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించింద‌ని వెంకీ పేర్కొన్నారు.

70 పరుగుల ల‌క్ష్యంతో లంచ్ తర్వాత బ‌రిలోకి దిగిన భార‌త్ రెండు వికెట్లు కోల్పోయి విజ‌యం సాధించింది. మయాంక్‌ అగర్వాల్‌ (5), పుజారా (3) వికెట్‌ కోల్పోయినప్పటికీ    కెప్టెన్‌ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు) భార‌త్‌ను విజ‌య తీరాల‌కు చేర్చారు.  లక్ష్యం చిన్నదే కావడంతో  భారత్‌ సునాయాసంగా గెలుపు బాట పట్టింది. మూడో టెస్ట్ జ‌న‌వ‌రి 7న జ‌ర‌గ‌నుంది.

ఇవి కూడా చ‌దవండి :

VIDEOS

తాజావార్తలు


logo