Venkatesh | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ నెట్టింట రౌండప్ చేస్తోంది.
వెంకటేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ టైం రానే వచ్చింది. ఫైనల్‌గా వెంకీ మామ సెట్స్‌లో జాయిన్ అయ్యే టైం ఫిక్సయింది. తాజా అప్డేట్ ప్రకారం వెంకటేశ్ ఈ మూవీ సెట్స్‌లో అక్టోబర్ 21 నుంచి జాయిన్ కానున్నాడు. సినిమా కథనంలో వెంకీ పాత్ర చాలా ఎమోషనల్‌గా, కీలకంగా ఉంటుందని.. వెంకీ రోల్ సినిమాలో హ్యూమర్ టచ్ ఇస్తుందని ఇన్సైడ్ టాక్.
ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల సాంగ్ అభిమానుల్లో జోష్ నింపేలా సాగుతోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ యాక్టర్, దసరా ఫేం షైన్ టామ్ చాకో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!