Venkatesh | టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ మరోసారి తన సూపర్ ఫామ్‌ను చూపిస్తూ తన కెరీర్లో గోల్డెన్ ఫేజ్‌ను ప్రారంభించారు. మూవీ మొఘల్ డి.రామానాయుడు వారసుడిగా ‘కలియుగ పాండవులు’తో వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ, కొన్ని సంవత్సరాలుగా ఫ్యామిలీ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ తనదైన స్థానం సంపాదించుకున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక కాస్త నిరాశలో ఉన్న వెంకటేశ్, 2025 సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టి తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, తెలుగు సినిమా రికార్డుల్లో ఓ మైలురాయిగా నిలిచింది.
ఈ సినిమాతో వెంకటేశ్ సీనియర్ హీరోల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన తొలి నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ‘గుంటూరు కారం’ సినిమాపై ఉన్న రూ.212 కోట్లు వసూళ్ల రికార్డును అధిగమించిన ఈ చిత్రం, 2025 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. బ్లాక్‌బస్టర్ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన వెంకటేశ్, ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వెంకటేశ్ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ 20నుంచి ప్రారంభించబోతున్నారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా వెంకటేశ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేయగా, ఇప్పుడిదే కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుంది. అక్టోబర్ 6 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.అంతేకాదు, సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘దృశ్యం 3’ కూడా వెంకటేశ్ చేయనున్నారు. అదీ కాకుండా, నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలువురు యువ దర్శకులు కూడా వెంకటేశ్‌కు కథలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.ఈ లైనప్ చూస్తుంటే, వెంకటేశ్ వచ్చే రెండు మూడేళ్లపాటు బిజీగా ఉండటం ఖాయం అని చెప్పొచ్చు. హిట్ ట్రాక్‌లోకి వచ్చిన వెంకీ మళ్లీ తన సత్తా నిరూపించుకుంటూ కొత్త తరానికి కూడా కనెక్ట్ అవుతున్నారు. మాస్ యాక్షన్ బాటలో కాకుండా, ఫ్యామిలీ ఎంటర్టైనర్లలోనే తన స్పెషల్ స్టైల్‌తో కొనసాగుతూ వేర్వేరు జనరేషన్లలో ఫ్యాన్ బేస్ సాధిస్తూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.